Telangana : చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడు.. ఊరంతా షాక్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవంద్గి గ్రామాంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం.. తమ ఇంటి వ్యక్తి చనిపోయాడనుకొని వేరే వ్యక్తిని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. చివరికి ఆ ఇంటి వ్యక్తి వేరే ఊరి నుంచి రావడంతో అందరూ షాక్ అయ్యారు. By B Aravind 23 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి A Man Appears His Home Town : చోరీకి గురైన ఒక మొబైల్ ఫోను (Mobile Phone) ఆ కుటుంబానికి షాకిచ్చింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న అసలు వ్యక్తిని చనిపోయినట్లుగా భావించారు ఆ కుటుంబ సభ్యులు. అంత్యక్రియల (Rituals) కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. చివరిసారి చూసేందుకు బంధువులు, మిత్రులు అందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కైపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.... బషీరాబాద్ మండలం నవంద్గి గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (45) పశువుల కాపరిగా పనిచేసేవాడు. Also Read: తెలంగాణలో దారుణం.. పొలం పనికి రావడం లేదని గిరిజన మహిళ ప్రైవేట్ పార్ట్స్ పై.. రెండు రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఫోన్ దొంగిలించిన వ్యక్తి వికారాబాద్ సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. అతడి మొఖం పూర్తిగా చిద్రమైపోయి ఎవరు గుర్తుపట్టలేని విధంగా తయారైపోయింది. దీంతో రైల్వే పోలీసులు గమనించి అతడి వద్ద ఐడెంటిటీ కోసం తనిఖీ చేయగా వాళ్లకి ఆ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా నవంద్గీ గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించినప్పటికీ గుర్తుపట్టలేని విధంగా శవం ఉండడంతో తమ కుటుంబ సభ్యుడే అని భావించి ఇంటికి తీసుకొచ్చారు. ఎల్లప్ప చనిపోయిన విషయం బంధుమిత్రులందరికీ తెలిసిపోయింది. చివరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గుంతను తవ్వి అంతా సిద్ధం చేశారు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. నవంద్గి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చనిపోయాడనుకున్న పిట్టల ఎల్లప్ప తాండూరులో కనిపించాడు. దీంతో అతడిని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వెళ్లి అతడిని పలకరించాడు. నువ్వు చనిపోయావు అనుకుని ఎవరిదో శవాన్ని తీసుకువచ్చి మీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారని చెప్పడంతో అతడు కంగుతిన్నాడు. అదే వ్యక్తితో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి తాను బతికి ఉన్నట్లు చెప్పాడు. హుటాహుటిన గ్రామానికి వెళ్లి పోయాడు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రత్యక్షం కావడంతో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు (Family Members) గ్రామస్తులు అంత అవాక్కైపోయారు. వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. Your browser does not support the video tag. Your browser does not support the video tag. Also Read: హైదరాబాద్–విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! #telugu-news #vikarabad #rituals #a-man-appears-his-home-town మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి