Srisailam : తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం.. వీడియో వైరల్!

శ్రీశైలం తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ గోడపై నుంచి చిరుత వెళ్తుండగా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అధికారులు సూచించారు. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Srisailam : తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం.. వీడియో వైరల్!

Telugu University : శ్రీశైలం తెలుగు యూనివర్సిటీ (Srisailam Telugu University) సమీపంలో చిరుతపులి (Leopard) సంచరించడం కలకలం రేపింది. యూనివర్సిటీ సమీపంలోని గోడపై నుంచి అడవిలోకి చిరుత వెళ్తుండగా అక్కడున్న స్థానికులు సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతండగా పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ, దేవస్థానం అధికారులు సూచించారు.

Also Read : పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం..!

Advertisment
తాజా కథనాలు