పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఓ జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై ఈ దారుణం జరిగింది. ఉదయం చూస్తే సెమినార్ హాల్‌లో మృతదేహాం కనిపించింది. శరీరంపై చాలాచోట్ల తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read: సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం.. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్న కేటీఆర్, ఏలేటి
జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. నిందితుడు ఎవరైనా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. హంతకుడికి ఉరిశిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.