West Bengal: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం.. హంతకుడికి ఉరిశిక్ష !

పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. హంతకుడికి ఉరిశిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమతా బెనర్జీ అన్నారు.

New Update
West Bengal: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం.. హంతకుడికి ఉరిశిక్ష !

పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఓ జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్‌ డాక్టర్‌పై ఈ దారుణం జరిగింది. ఉదయం చూస్తే సెమినార్‌ హాల్‌లో మృతదేహాం కనిపించింది. శరీరంపై చాలాచోట్ల తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read: సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం.. మేఘా కంపెనీని బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్న కేటీఆర్‌, ఏలేటి

జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. నిందితుడు ఎవరైనా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. హంతకుడికి ఉరిశిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు