National: దుమ్ము లేపుతున్న మేక్ ఇన్ ఇండియా వస్తువులు

ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్‌ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు.

National: దుమ్ము లేపుతున్న మేక్ ఇన్ ఇండియా వస్తువులు
New Update

Make In India: మేక్ ఇన్ ఇండియా పెద్ద సక్సెస్ అయిందని చెప్పారు ప్రధాని మోదీ. ప్రపంచ వ్యాప్తంగా ఇండియాలో తయారయిన వస్తువులు బాగా అమ్ముడుపోతున్నాయని...సంపదను సృష్టిస్తున్నాయని తెలిపారు.

మేక్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయో మై గవర్నమెంట్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇండియాలో తయారవుతున్న సైకిళ్ళు ప్రపంచ వ్యాప్తంగా తెగ అమ్ముడవుతున్నాయి. యూకే, జర్మనీ, నెదర్లాండ్స్‌కు ఇక్కడ నుంచే సైకిళ్ళు ఎగుమతవుతున్నాయి. ఇది రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని...దీని వల్ల గ్లోబల్ ఎకానమీ పెరుగుతోందని తెలిపింది.

ఇక బీహార్‌లో తయారయిన బూట్లు ప్రస్తుతం రష్యన్ ఆర్మీలో ఒక పార్ట్‌ అయ్యాయి. ఇది కూడా భారత్‌లో తయారయిన వస్తువులపై ప్రపంచ దేశాలు ఎలా ఆధారపడుతున్నాయో తెలిపేందుకు ఉదాహరణగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంటర్నెషనల్ డిఫన్స్ మార్కెట్‌లో భారత తయారీ సామర్ధ్యాన్ని నిరూపిస్తుందని చెప్పింది.

మరోవైపు కశ్మీర్‌లో తయారవుతున్న విల్లో బ్యాట్స్‌కు గ్లోబల్‌గా హైడిమాండ్ ఉంది. వరల్డ్‌కప్‌లో ఈ బ్యాట్లనే ఉపయోగించారు. ఈ బ్యాట్లు భారతీయుల పనితనాన్ని చూపెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌లో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.

అన్నింటికంటే అమూల్ గురించి ముందు చెప్పుకోవాలి. యూఎస్‌లో అమూల్ ఇప్పటికే పాగా వేసింది. అమెరికాలో భారతీయులతో పాటూ అక్కడి వారు కూడా అమూల్‌ను వాడడానికి ఇష్టపడుతున్నారు. ఇది భారతీయ పాల ఉత్పత్తుల అభివృద్ధిని సూచిస్తోంది. దాంతో పాటూ భారత రుచిని ప్రపంచ వ్యాప్తం చేస్తోంది.

మరోవైపు భారత డిజిట్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడు చాలా దేశాల్లో యూపీఐ ను వాడుతున్నారు. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచ ఆర్ధికవిధానంలో ఒక రివల్యూషన్‌ను తీసుకువచ్చిందని చెబుతున్నారు.

వీటన్నింటితో పాటూ అతరిక్షంలో కూడా భారత మిస్సైల్స్ పాగా వేస్తున్నాయి. బ్రహ్మోస్ మిస్సైల్స్...భారత, రష్యా సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి సౌత్ చైనాలో ఆపరేటంగ్‌లో ఉన్నాయి. ఇది భారత డిఫెన్స్ సామర్ధ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయి. గ్లోబల్ సెక్యూరిటీలో భారతదేశం రోల్‌ ప్రాముఖ్యతను తెలుపుతోంది.

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌ను ఇండియాలో సైబర్ మండే సేల్స్ డామినేట్ చేస్తున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా వస్తువులకు ప్రపంచంలో ఎంత ఆదరణ ఉందో తెలియజేస్తున్నాయి. భారతదేశం ఈ కామర్స్...గ్లోబల్‌ పెరుగుదలను సూచిస్తోంది.

#pm-modi #twitter #make-in-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe