Telangana: దారుణం.. ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా కరెంట్‌ షాక్‌తో బాలిక మృతి

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్‌ ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్‌ షాక్‌తో అంజలి అనే 9 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. ఛార్జింగ్ పెట్టే సమయంలో అంజలి చేతులు తడిగా ఉండటం వల్లే కరెంట్ షాక్ కొట్టి ఉండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

New Update
Telangana: దారుణం.. ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతుండగా కరెంట్‌ షాక్‌తో బాలిక మృతి

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫోన్‌ ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్‌ షాక్‌తో 9 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన అంజలి కార్తిక స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఛార్చింగ్ పెట్టే సమయంలో కరెంట్ షాక్‌ కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఛార్జింగ్ పెట్టే సమయంలో అంజలి చేతులు తడిగా ఉండటం వల్లే కరెంట్ షాక్ కొట్టి ఉండొచ్చని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: పురుగుల మందులతో క్యాన్సర్‌ ముప్పు.. పరిశోధనలో వెల్లడైన సంచలన నిజాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు