/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ISTANBUL-jpg.webp)
Fire Accident : టర్కీ(Turkey) లోని ఇస్తాంబుల్‌లోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది మరణించారు. క్లబ్ నిర్వాహకులతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రి(Hospital) లో చికిత్స అందిస్తున్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్తాంబుల్(Istanbul) లో ఉన్న నైట్‌క్లబ్(Night Club) పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయి. 16 అంతస్తుల నివాస భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించినవారంతా కార్మికులని అధికారులు తెలిపారు.
At least 29 people now confirmed to have died in fire at Istanbul nightclub undergoing renovations https://t.co/9hwIA9Yj1R
— BBC Breaking News (@BBCBreaking) April 2, 2024
29 Turkish workers died at a basement level night club in Istanbul during a reconstruction pic.twitter.com/ZO1oe3QJdl
— Ragıp Soylu (@ragipsoylu) April 2, 2024
ఇది కూడా చదవండి : కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్