Accident: ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ముక్కలైన యువకుడి తల!

ఏపీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె -బెంగళూర్ జాతీయ రహదారి చీకిలబైలు చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సును బైక్ ఢికొట్టింది. బైక్ పై వెళ్తున్న మోహన, సాయికుమార్ అనే యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.

New Update
Accident: ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ముక్కలైన యువకుడి తల!

AP News: ఏపీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె -బెంగళూర్ జాతీయ రహదారి చీకిలబైలు చెక్ పోస్ట్ సరిహద్దు వద్ద ఆర్టీసీ బస్సును బైక్ ఢికొట్టింది. దీంత బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు పెద్దమండ్యం మండలం బట్టవారిపల్లికి చెందిన ఎర్రగొల్ల వెంకటరమణ శివమ్మ దంపతుల కుమారుడు మోహన, అదే ఊరికి చెందిన ఎర్రగోల్ల రెడ్డప్ప కుమారుడు సాయికుమార్ గా పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు