Viral Video: మందు తాగినవారు ఏం చేస్తున్నారో వారికి కూడా తెలియని స్థితిలో కొందరు నానా రకాల విన్యాసాలు చేసి చూపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అకారణంగా పక్కవారితో, వారికి ఎదురు వచ్చిన వారితో గొడవ పడుతుంటారు. అసలు వారి చుట్టుపక్కల ఉన్నవాటితో మాకు సంబంధం లేదు..మేము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని పట్టుబడతారు..సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.
ఓ వ్యక్తి ఫుల్గా మందు తాగి మచిలీపట్నం (Machilipatnam) ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు.. చేతిలో ఓ కుక్క పిల్ల కూడా ఉంది. ఆ కుక్క పిల్లను చూపించి.. 'నా పిల్లికి' వైద్యం చేయమంటూ ఆస్పత్రిలో ఉన్న సిబ్బందితో గొడవకు దిగాడు. ఇది జంతువులకు వైద్యం చేసే ఆస్పత్రి కాదు.. వెటర్నరీ ఆస్పత్రికి వెళ్లాలని అక్కడి సిబ్బంది ఎంత మొత్తుకుని చెప్పినా..వినకుండా వారితో వితండ వాదన మొదలు పెట్టాడు. ఆస్పత్రి సిబ్బంది ఎంత మొత్తుకున్నా వినకుండా.. ఇక్కడ వైద్యం చేయాల్సిందే అంటూ పట్టబట్టాడు మందుబాబు.
కుక్క కాదు పిల్లి అంటూనే అక్కడి వారితో వాదించాడు మందబాబు.'తాగింది మీరా లేక నేనా.. చెబితే వినరా?' అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. మనోడి వాదన దెబ్బకు అక్కడున్న సిబ్బంది, రోగుల బంధువులు అవాక్కయ్యారు. పిల్లికి వైద్యం చేయ్యాల్సిందేనని అక్కడే నిలబడ్డాడు.. అతడికి ఎంత చెప్పిన వినలేదు.. తన దగ్గర ఉంది పిల్లే అంటూ అందరికి చూపించాడు. ఆసుపత్రి సిబ్బందితో పాటు అక్కడున్న జనాలు కూడా కుక్క పిల్ల అని చెప్పినా ఒప్పుకోలేదు. మనోడు మత్తులో చేస్తున్న విచిత్ర ప్రవర్తనని చూసి అక్కడి వారు సరదాగా నవ్వుకున్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.