Noida : హెల్మెట్‌ పెట్టుకోలేదని... కారు డ్రైవర్‌ కు ఫైన్‌.. ఎంతో తెలుసా!

కారులో హెల్మెట్‌ పెట్టుకోలేదని తుషార్‌ సక్సేనా అనే వ్యక్తికి ఫైన్‌ కట్టాలంటూ యూపీ పోలీసులు నోటీసు పంపించారు. కారులో హెల్మెట్ లేదనే కారణంతో ట్రాఫిక్‌ పోలీసులు తనకు రూ.1000 జరిమానా వేశారని తుషార్‌ తెలిపాడు.

New Update
Noida : హెల్మెట్‌ పెట్టుకోలేదని... కారు డ్రైవర్‌ కు ఫైన్‌.. ఎంతో తెలుసా!

Noida Police : బండి మీద వెళ్లేప్పుడు హెల్మెట్‌ (Helmet) ధరించలేదని చాలా మందికి ట్రాఫిక్‌ అధికారులు జరిమానా విధించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా కారు డ్రైవర్ హెల్మెట్‌ పెట్టుకోలేదని ఫైన్‌ కట్టాలంటూ..ఓ నోటీసు పంపించారు. యూపీ (UP) లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తుషార్‌ సక్సేనా అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది.

అసలు తాను ఎప్పుడూ కారులో నోయిడాకు వెళ్లలేదని, కానీ అక్కడి ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) మాత్రం హెల్మెట్ లేదనే కారణంతో తనకు రూ.1000 జరిమానా వేశారని... తుషార్ తెలిపాడు. జరిమానాకు సంబంధించి మొదట ఒక మెసేజ్ రాగా దానిని తాను అంతగా పట్టించుకోలేదని ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే అని అనుకున్నానని చెప్పుకొచ్చాడు.

అయితే ఆ తర్వాత ఒక ఈ-మెయిల్, మరొక మెసేజ్ కూడా రావడంతో విషయం అర్థమైందని, నోయిడా (Noida) కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ జిల్లాలో తాను నివసిస్తున్నానని అతడు తెలిపాడు. జరిమానా విషయమై ట్రాఫిక్ పోలీసులను సంప్రదించానని, హెల్మెట్ లేకుండా ఫోర్-వీలర్ వాహనాన్ని నడిపినందుకు ఫైన్ విధించామంటూ సమాధానం ఇచ్చారని తుషార్ సక్సేనా వివరించాడు. జరిమానా చెల్లించకపోతే కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారని వివరించాడు.

Also Read: రష్యాపై డ్రోన్ దాడి.. 38 అంతస్తుల భవనంపై..

Advertisment
తాజా కథనాలు