Hyderabad: దారుణం.. కారులో లభ్యమైన మృతదేహం.. హైదరాబాద్‌లోని మణికొండలో ఓ కారులో మృతదేహం లభ్యం కావడం కనిపించడం రేపుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి మణికొండకు చెందిన ఆటోడ్రైవర్ రమేష్‌గా గుర్తించారు. ఇది ఆత్మహత్యనా లేదా హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 04 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని మణికొండలో ఓ కారులో మృతదేహం కనిపించడం కలకలం రేపుతోంది. మారుతి వ్యాన్‌లో మృతదేహం ఉండటం చూసిన స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో వెంటనే పోలీసులు సమాచారం మేరకు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: రష్యాలో భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ గూఢచారి.. అయితే ఆ మృతదేహం కారు డ్రైవర్ వెనక సీటులో కనిపించింది. అతడు మణికొండకు చెందిన ఆటోడ్రైవర్ రమేష్‌గా గుర్తించారు. శనివారం అతడు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్నేహితులతో అతడికి గొడవ జరిగినట్లు సమాచారం. అయితే రమేశ్ హత్యకు గురయ్యాడా? లేక అనారోగ్యంతో మృతి చెందాడా? లేదా ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. Also Read: కేసీఆర్ దుర్మార్గుడు… చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు #telugu-news #crime-news #hyderabad-news #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి