AP: రూ.500 కోసం ఆత్మహత్య చేసుకున్న దంపతులు

ఐదు వందలకోసం గొడవపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త రాంబాబు భార్య కనకదుర్గను డబ్బులు కావాలని అడగడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాంబాబు ఉరేసుకుని చనిపోగా ఆమె కూడా ఉరేసుకుని తనువు చాలించింది.

AP: రూ.500 కోసం ఆత్మహత్య చేసుకున్న దంపతులు
New Update

Gudivada:  ఏపీలో దారుణం జరిగింది. డబ్బు దంపతుల ప్రాణం తీసింది. అయితే అదేమీ పెద్ద అమౌంట్ కాదు. కేవలం ఐదు వందల కోసం గొడవపెట్టుకున్న భార్యభర్తలు.. క్షణాకావేశంలో తనువు చాలించారు. జీవితాంతం తోడుంటానని కట్టుకున్నవాడు లేని లోకంలో తాను ఉండలేనని ఇల్లాలు సైతం ఆత్మహత్య చేసుకుంది. స్థానికులతోపాలు రెండు రాష్ట్రాల ప్రజలను కలిచివేస్తున్న ఈ దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా గుడివాడ (Gudi vaada)లో చోటు చేసుకుంది.

భర్త మద్యానికి బానిసై..
ఈ మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా గుడివాడలోని వాసవి నగర్ కు చెందిన దంపుతులు కొలుసు రాంబాబు (45), కనకదుర్గ (40)లు చిన్న విషయంలో గొడవపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాంబాబు కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో అప్పుడప్పుడు డబ్బుల కోసం గొడపడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం రూ. 500 వందలు కావాలని భార్య కనకదుర్గను అడిగాడు. దీంతో రాంబాబు మద్యం తాగడం ఇష్టంలేని కనకదుర్గ కోపంలో నాలుగు మాటలు తిట్టి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ పెద్దదైంది.

ఇది కూడా చదవండి : Divorce: మాలిక్‌తో విడాకులపై స్పందించిన సానియా తండ్రి.. ఏమన్నారంటే!

భార్య ఉరేసుకుని..
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాంబాబు.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తెలుసుకున్న భార్య కనకదుర్గ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే విషయం గమనించిన స్థానికులు, బంధువులు కనకదుర్గను హాస్పిటల్ తీసుని వెళ్తుండగా కారులోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలుండగా.. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు. చిన్న కుమారుడు ప్రవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ దంపతుల ఆత్మహత్యతో కుటుంబంలో విషాద ఛాయలు ఆలముకోగా.. తమతో ప్రతిరోజు సరదాగా ఉండే దంపతులు చనిపోవడం ఇరుగుపోరుగును కలిచివేసింది.

#gudivada #sucide #rambabu #kanadurga
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe