హర్యానా (Haryana) లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కాంట్రాక్టర్ (Contractor) ను చిత్ర హింసలు పెట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారు కొందరు దుండగలు. ఈ దారుణ ఘటన హిసార్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ రాకేష్ గవర్నమెంట్ పనుల కోసం కాంట్రాక్టులు తీసుకుంటు ఉంటాడు.
అయితే కొద్ది రోజుల క్రితం కేవలం రెండు ఇళ్ల కోసం రోడ్డుకు శంకుస్థాపన చేయాలని సదల్‌పూర్ కు చెందిన సంతలాల్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కూడా. కానీ ఆ విషయం సంతలాల్ కి తెలియదు.
ప్రభుత్వం తన దరఖాస్తుకి ఆమోదం తెలపలేదు అనుకొని ..దానికి కారణం..కాంట్రాక్టర్ రాకేష్ అనుకొని ఆయన మీద పగ పెంచుకున్నాడు. రాకేష్ ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుడా అని వేచి చూసిన సంతలాల్ గురువారం రాకేష్ కారులో వెళ్తుండగా ఆయనను మరి కొందరు వ్యక్తులతో కలిసి వెంబడించారు.
ఒకానొక నిర్మానుష్య ప్రదేశంలో అతనిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టడమే కాకుండా కరెంట్ షాక్ తో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నిందితులు అక్కడితో ఆగకుండా రాకేష్ నోట్లో గేదెల పేడ పెట్టడంతో పాటు..ముక్కు పై షూ రుద్దడంతో పాటు ఉమ్మి కూడా వేసి..నానా అరాచకం చేశారు. అంతేకాకుండా ఈ ఘటన అంతటిని కూడా సెల్ ఫోన్లలో కూడా చిత్రీకరించారు.
వారి నుంచి తప్పించుకున్న రాకేష్..పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నిందితులు సంత్ లాల్ తో పాటు అతని ఇద్దరు కుమారులు, సందీప్, వికాస్, పీకే, ఆత్మారామ్ , విక్రమ్, నవీన్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు తనను కిడ్నాప్ చేసినప్పుడు తన కళ్లకు గంతలు కట్టి పొలాల్లో నిర్మించిన ఓ ఇంటికి తీసుకుని వెళ్లినట్లు రాకేష్ తెలిపారు. ఆ గదిలో పెట్టి బెల్టులతో తీవ్రంగా కొట్టడమే కాకుండా..కరెంట్ షాక్ పెట్టడంతో పాటు నోట్లో గేదె పేడ వేయడంతో పాటు ఉమ్మి కూడా వేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనలో సంతలాల్ కుమారుడు, అతని స్నేహితుడు కలిసి తనని చిత్ర హింసలు పెట్టినట్లు తెలిపారు.
రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి సంత్ లాల్ అతని కుమారులతో పాటు పలువురి పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.