Telangana : దారుణం.. గులకరాయి గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఏడాదిన్నర ఏళ్ల చిన్నారి గొంతులో గులకరాయిరాయి ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందింది. కడవేర్గు గ్రామానికి చెందిన జరీనాబేగం తన పిల్లల్ని తీసుకొని పుట్టింటి వెళ్లగా.. చిన్నకూతురు ఆడుకుంటూ గులకరాయి మింగడంతో ఈ ఘటన జరిగింది. By B Aravind 21 Jun 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Pebble Stuck In Throat : సిద్దిపేట జిల్లా (Siddipet District) చేర్యాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఏడాదిన్నర ఏళ్ల చిన్నారి గొంతులో గులకరాయి (Pebble) ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన షబీర్‌పాషా - జరీనాబేగం దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే తల్లి జరీనా.. పిల్లలను తీసుకొని రాంసాగర్‌లో తన పుట్టింటికి వెళ్లింది. గురువారం మధ్యాహ్నం ఇంటి దగ్గర ఆడుకుంటుండగా.. చిన్న కూతురు అలీషా గులకరాయి మింగింది. Also read: తమిళనాడులో కల్తీసారా కలకలం.. 40కి చేరిన మృతుల సంఖ్య గొంతు (Throat) లో గులకరాయి ఇరుక్కుపోవడంతో చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు నోట్లో చూడగా.. మట్టి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. గొంతు దగ్గర ఉబ్బినట్లు కనిపించడంతో మట్టితో పాటు చిన్నారి గులకరాయి మింగినట్లు గుర్తించారు. షబీర్‌పాషా కూడా వెంటనే అక్కడికి చేరుకొని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) కి తీసుకెళ్లాడు. వైద్యుల సూచనతో సిద్దిపేటలో ఉన్న ఆస్పత్రికి వెళ్తుండగా.. మార్గమాధ్యంలోనే చిన్నారి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. Also read: యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా..? #telugu-news #telangana-news #child #pebble మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి