YSR: వైఎస్‌ అనుచరుడి పై కేసు నమోదు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (AP) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YSR) వ్యక్తిగత సహాయకుడు ఎర్రం రెడ్డి సూరీడు(Suridu) మీద బంజారాహిల్స్‌ పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఆయనతో మరో ముగ్గురు పోలీసు అధికారుల పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

YSR: వైఎస్‌ అనుచరుడి పై కేసు నమోదు!
New Update

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (AP) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YSR) వ్యక్తిగత సహాయకుడు ఎర్రం రెడ్డి సూరీడు(Suridu) మీద బంజారాహిల్స్‌ పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఆయనతో మరో ముగ్గురు పోలీసు అధికారుల పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం క్రితం సూరీడుతో పాటు ముగ్గురు పోలీసు అధికారులు తన పై దాడి చేసినట్లు సూరీడు అల్లుడు సురేందర్‌ రెడ్డి ఫిర్యాదు చేశాడు.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సూరీడు కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్‌ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవలు రావడంతో సూరీడు కుమార్తె తన భర్త పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం సురేందర్ రెడ్డి తన కుమార్తెను చూడటానికి జూబ్లీహిల్స్‌ లోని భార్య ఉంటున్న సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

ఆ సమయంలో సురేందర్‌ రెడ్డి మధ్య సూరీడు, ఆయన కుమార్తె మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే సూరీడు తన అల్లుడి పై దాడి చేశాడు. దీంతో సూరీడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సురేందర్ ను అదుపులోనికి తీసుకోవడంతో పాటు ఆయన చేతిలో ఉన్న కొన్ని వస్తువులతో పాటు, ఆయన బండిని కూడా స్టేషన్ కు తరలించారు.

అయితే సురేంద్ర తమను చంపేందుకు ప్రయత్నించాడని సూరీడు ఆరోపిస్తే..సూరీడుతో పాటు జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌ రెడ్డి, ఎస్సై నరేష్‌ తో పాటు ప్రస్తుతం ఏపీ ఐజీ కూడా ఆ సమయంలో తనను నిర్బంధించి దాడి చేశారని సురేంద్ర ఆరోపించారు. తన పై తప్పుడు కేసులు పెట్టినట్లు కూడా సురేంద్ర ఆరోపించి కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఈ కేసు గురించి ఇరు వైపుల వాదనలను నమోదు చేసుకుని న్యాయమూర్తి పరిశీలించి కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించారు. అయితే కేసు నమోదు అయ్యి రెండు సంవత్సరాలు అయినప్పటికీ సురేంద్ర కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు సూరీడుతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారుల పై కేసులు నమోదు అయ్యాయి.

#ap #police #hyderabad #personal-assistent #ysr #case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe