Flight: విమానంలో అనుహ్య ఘటన.. బోనులో నుంచి తప్పించుకున్న గుర్రం..

అమెరికాలోని న్యూయార్క్ నుంచి బెల్జియంకు బయలుదేరిన బోయింగ్‌ విమానంలో బోను నుంచి ఓ గుర్రం తప్పించుకుంది. విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాలకు ఆ గుర్రం తప్పించుకోని అందులోనే తిరిగింది. ఆ తర్వాత బయటకు దూకేసింది. చివరికి సిబ్బంది ఆ గుర్రాన్ని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Flight: విమానంలో అనుహ్య ఘటన.. బోనులో నుంచి తప్పించుకున్న గుర్రం..

అమెరికా నుంచి బెల్జియంకు వెళ్తున్న ఓ విమానంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బోను నుంచి ఓ గుర్రం తప్పించుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. దీంతో ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్‌కు చెందిన బోయింగ్ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని జాన్‌.ఎఫ్ కెన్నెడీ ఎయిర్‌పోర్టు నుంచి బోయింగ్ 747 అనే ఓ కార్గో విమానం బెల్జియంకు బయలుదేరింది. అయితే అందులో ఒక గుర్రాన్ని కూడా తరలిస్తున్నారు. విమానం బయలుదేరిన 30 నిమిషాల తర్వాత అందులో ఉన్న బోను నుంచి గుర్రం తప్పించుకొని విమానంలోనే తిరిగింది.

Also Read: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్‌ ని ఎంజాయ్‌ చేశా: సత్య నాదెళ్ల!

అయితే గుర్రం ఒక్కసారిగా బయటకు దూకడంతో సిబ్బంది ఒక్కసారిగా భయపడిపోయారు. దీంతో గుర్రం బయటకు వచ్చిన విషయాన్ని విమాన సిబ్బంది ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. విమానం బరువు ఎక్కువగా ఉండటం వల్ల 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ సముద్రంలో డంప్ చేయాల్సి వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే విమానాన్ని తిరిగి న్యూయార్క్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత విమానశ్రయ సిబ్బంది గుర్రాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. అయితే గుర్రం అలా విమానంలో నుంచి దూకడంతో దానికి గాయాలైనట్లు సమాచారం. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలాంటి తరహా ఘటన చోటుచేసుకుంది. ఇరాకీ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో.. ఓ ఎలుగుబంటి పెట్టెలోంచి బయటపడి తిరిగింది. దీంతో విమానం తిరుగు ప్రయాణం ఆలస్యం కావడంతో.. ఆ విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు కోరింది.

Also read: ఇండస్ట్రీని కలవరపెడుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో

Advertisment
Advertisment
తాజా కథనాలు