/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-3-4-jpg.webp)
Suryapet : ఎండ వేడి(Heat) కారణంగా మరోకారు దగ్ధమైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ(Government Junior College) వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ముందుగానే గమనించి కారునుంచి సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది(Fire Fighters) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. వీడియో వైరల్ అవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు.. చివ్వెంల మండలం వట్టి కాంపాండు గ్రామానికి చెందిన గోపాలరావు అతని కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం సూర్యాపేటకు వస్తుండగా ఈ ప్రమాదం(Fire Accident) జరిగిందని చెప్పారు. ఎండ వేడి కారణంగా కారులో షార్ట్ సర్క్యూట్ వల్లే ఇలా అయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి:Crime: శృంగారంపై మోజుతో యువకులను వేధించిన వివాహిత.. ప్రియుడు ఏం చేశాడంటే!
Follow Us