Car Hits Constable in Hyderabad: హైదరాబాద్‌లోని చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను ఓ కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల కోడ్(Telangana Election Code) నేపథ్యంలో అక్టోబర్ 18వ తేదీన హైదరాబాద్(Hyderabad) చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ మహేష్ మరికొందరు అధికారులు నాకబంది విధులు నిర్వహిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో వాహనాలను ఆపి తనిఖీ చేస్తుండగా.. ఇంతలో ఓ కారు వస్తుండగా దానిని ఆపేందుకు ప్రయత్నించాడు కానిస్టేబుల్ మహేష్. అయితే, కారు డ్రైవర్ కారును ఆపకుండా కానిస్టేబుల్‌ను ఢీకొట్టి, తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ పక్కనే ఉన్న ఇతర సిబ్బంది.. వెంటనే కానిస్టేబుల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ బయటకు రావడంతో విషయం వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిదో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
మోండా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం..
సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో పాలికబజార్ సెల్లారులో అగ్ని ప్రమాదం సంభవించింది. సిటీ కలెక్షన్ బ్యాగుల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటు చుట్టుపక్కన వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే, ప్రమాదగానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాగానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..
మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం బొందలకుంట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం మినీ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..