UP : భార్య ముందే భర్తను 3కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. చక్రాల మధ్య ఇరుక్కుని యూపీలోని రాయ్‌బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన ఓ కారు ఫ్యామిలీతో వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టింది. భార్య, కొడుకు కిందపడిపోగా చక్రానికి, ఫెండర్‌కు మధ్య ఇరుక్కుపోయిన వీరేంద్రను అలాగే మూడు కి.మీ ఈడ్చుకెళ్లగా అతను మృతిచెందాడు. డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 03 Feb 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Accident : యూపీ లో దారుణమైన రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తమ బైక్(BIKE) పై ఆనందంగా భార్య పిల్లలతో బయటకు వెళ్తున్న వ్యక్తిని కారు(CAR) రూపంలో మృత్యువు వెంటాడింది. అప్పటిదాకా నవ్వుతూ సాగిన వారి ప్రయాణంలో ఒక్కసారిగా విషాధ చాయలు అలుముకున్నాయి. రోడ్డుపై వేగంగా వస్తున్న కారు బండిని ఢీ కొట్టి భార్య, కొడుకు ముందే కుటుంబ పెద్దను కిలోమీటర్ల దూరం కారు లాక్కెల్లిన భయంకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకుంది. భార్య, ఐదేళ్ల కుమారుడితో.. ఈ మేరకు యూపీ లోని రాయ్‌బరేలీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. వీరేంద్ర కుమార్(Virendra Kumar).. తన భార్య, ఐదేళ్ల కుమారుడితో కలిసి రాయ్‌బరేలీ నుంచి డాల్మౌ పట్టణానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఇన్నోవా కారు(Innova Car) ఆ బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో భార్య, కుమారుడు రోడ్డుపై పడిపోగా.. కారు చక్రానికి, ఫెండర్‌కు మధ్య వీరేంద్ర ఇరుక్కుపోయాడు. దీంతో డ్రైవర్ కారును ఆపకుండా అలాగే మూడు కిలోమీటర్లు పోనిచ్చాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలైన వీరేంద్ర రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇది కూడా చదవండి: Crime News: బాపట్ల జిల్లాలో దారుణం.. రైతు భరోసా కేంద్రంలోనే ఉద్యోగి ఆత్మహత్య..! మార్గంమధ్యలో మృతి.. అయితే అటుగా వెళ్తున్న స్థానికులు ఈ విషయం గమనించి కారు వెంటపడి ఆపారు. అనంతరం బాధితుడిని అందులోనుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అతడి భార్య, కుమారుడు చికిత్స పొందుతున్నారు. డ్రైవర్‌ను పారిపోకుండా పట్టుకుని స్థానికులు తమకు అప్పగించారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. #road-accident #car #uttar-pradesh #bike మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి