/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
Hyderabad Rowdy Sheeter Brutal Murder : బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంచన్ బాగ్ కు చెందిన రియాజ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బాలాపూర్ ఆర్‌సీఐ రోడ్డులో రియాజ్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. ఆ తరువాత రియాజ్ కళ్లలో కారం చల్లి కాల్పులు జరిపి చంపేశారు.
ఈ ఘటనా గురించి తెలుసుకున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) కి తరలించారు. ఘటనా స్థలిలో ఉన్న బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రియాజ్ పై ఇటు బాలాపూర్ తో పాటు హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా పలు కేసులు ఉన్నాయని సీపీ వివరించారు. ప్రస్తుతం రియాజ్ మీర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని సీపీ పేర్కొన్నారు.
Also read: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన ప్రారంభించిన ఏపీ సర్కార్!
Follow Us