Guntur: తాను మరణిస్తూ.. మరో ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు..!!

తాను మరణిస్తూ మరో ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు ఓ యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ డెడ్ అయిన తన అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. గుంటూరులో జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది.

New Update
Guntur: తాను మరణిస్తూ.. మరో ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు..!!

Guntur: తాను మరణిస్తూ మరో ఐదు గురు జీవితాల్లో వెలుగు నింపాడు ఓ యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు తరలించారు. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది.

చిలకలూరిపేటకు చెందిన కట్టా కృష్ణ (18) గుంటూరులో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మూడు రోజులక్రితం కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి కృష్ణను ఢీ కొట్టింది. తలకి బలమైన గాయం తగలడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు రక్షించిన ప్రయత్నాలు ఫలించలేదు.

కృష్ణ కు బ్రెయిన్ డెడ్ అయ్యింది. డాక్టర్లు అవయవ దానంపై మృతుడి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో కృష్ణకు చెందిన లివర్, రెండు కిడ్నీలు, గుండె దానం చేశారు. ఆర్గాన్స్ అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గన్నవరం విమానాశ్రయానికి తరలించడం జరిగింది. కృష్ణ గుండెను చాపర్ సహాయంతో తిరుపతి పద్మావతి హాస్పిటల్ కు తరలించారు.కాలేయాన్ని వైజాగ్ కిమ్స్ హాస్పిటల్ కి తరలించగా..ఒక కిడ్నీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కి తరలించారు. మరొ కిడ్నీని గుంటూరు రమేష్ హాస్పటల్లో అవసరమైన వారికి అమర్చారు. తన కొడుకు చనిపోయినా మరో ఐదు కుటుంబాల్లో వెలుగులు‌ నింపడం ఆనందంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు. పెద్ద కుమారుడు మరణిస్తే అతని అవయవాలు దానం చేసి కుటుంబ సభ్యులు తమ గొప్ప మనసు చాటుకున్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాలకు ఫీవర్ అలర్ట్.. అధికారుల కీలక సూచనలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు