Karnataka: దారుణం.. పరీక్ష రాసేందుకు వెళ్తున్న బాలికపై యాసిడ్‌ పోసిన యువకుడు

కర్ణాటకలోని మంగళూరులో మవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపింది. అక్కడి స్థానికులు నిందితుడ్ని పట్టుకొని పోలీసులు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

New Update
హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

కర్ణాటకలోని మంగళూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపింది. స్థానిక పాఠశాలలో బాధితురాలు 12వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రానికి వెళ్తోంది. అదే సమయంలో అక్కడ ఆమె కోసం వేచి చూసిన 23 ఏళ్ల అబిన్‌ ఆమెపై యాసిడ్‌ విసిరాడు. దీంతో అక్కడున్నవారు నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.

Also Read: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టాలిన్‌ను మందలించిన సుప్రీంకోర్టు!

కేరళకు చెందిన అబిన్‌ అనే వ్యక్తికి బాధితురాలితో గత కొంత కాలంగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడు అబిన్‌, బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని చెప్పారు. వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా.. తాజాగా అబిన్‌ ఆమెపై యాసిడ్‌తో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెను వైద్యులు చికిత్స చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు ప్రారంభించామని వివరించారు.

Also Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు