Body Builder: గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్‌..

పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) గుండెపోటుతో మరణించాడు. బ్రెజిల్‌కు చెందిన ఈయన నవంబర్ 19న కాలేయంలో ట్యూమర్‌, రక్తస్రావం కారణంగా గుండెపోటుతో మృతి చెందాడు.

New Update
Body Builder: గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్‌..

ఈమధ్యకాలంలో చాలామంది గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన సంఘటనలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసేందే. నడుచుకుంటు వెళ్లేటప్పుడ, డ్యాన్స్ చేసేటప్పుడు, ఆఖరికి జిమ్‌లో కూడా వర్క్‌ఔట్ చేస్తున్న సమయంలో ఇలా హర్ట్‌హటాక్‌లకు గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) గుండెపోటుతో మరణించడం కలకలం రేపింది. బ్రేజిల్ దేశానికి చెందిన ఈయనకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. రొడాల్ఫో మరణవార్త తెలుసుకున్న అతని ఫాలోవర్స్ ఒక్కసారిగా షాకైపోయారు. అయితే అతను స్టేరాయిడ్స్‌ వాడటం వల్లే గుండెపోటుతో మరణించాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రొడాల్ప్‌ స్పోర్ట్స్ మెడిసిన్ అడ్‌ ఫార్మకాలజీ క్లినిక్‌ ఖండించింది.

Also read: రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

కాలేయంలో ట్యూమర్‌, రక్తస్రావం కారణంగా రోడాల్ఫో నవంబర్ 19న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ బ్రెజిల్ తెలిపింది. అయితే సోషల్ మీడియాలో చురుకుగా ఉండే రోడాల్ఫో.. తను జిమ్‌లో వర్కౌట్ చేసే ఫొటోలు, వీడియోలను రోజూ షేర్ చేస్తూ ఉండేవాడు. అంతేకాదు ఇటీవలే అతను నిశ్చితార్థ చేసుకొని తనకు కాబోయే భార్య కరోలిన్ సాంచెస్‌తో కలిసి వీడియోలను పోస్ట్‌ చేసేవాడు. ప్రస్తుతం రోడాల్ఫోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Also read: స్థానికుల ఇంట్లో ప్రత్యక్షమైన ప్రియాంక గాంధీ.. ఉప్పొంగిపోయిన దంపతులు..

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు