Body Massager: దీనిని సెక్స్ టాయ్ గా పరిగణించలేం.. హైకోర్టు కీలక తీర్పు!

బాడీ మసాజర్ ను సెక్స్ టాయ్ గా పరిగణించడంపై ముంబై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కస్టమ్స్ అధికారులు దీని దిగుమతి బ్యాన్ చేసిన కేసులో విచారణ జరిపింది న్యాయస్థానం. దీనిని శృంగార పరికరంగా వాడుతారనేది అపోహ మాత్రమేనని తెలిపింది.

New Update
Body Massager: దీనిని సెక్స్ టాయ్ గా పరిగణించలేం.. హైకోర్టు కీలక తీర్పు!

Mumbai: బాడీ మసాజర్ ను సెక్స్ టాయ్ గా పరిగణించడంపై ముంబై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. బాడీ మసాజర్ ను సాధారణ వస్తువు లేదా శృంగార వాంఛ తీర్చుకునే వస్తువుగా చూడాలా? అనే కేసులో వివాదం చోటుచేసుకోగా ఇది కోర్టు వరకూ వెళ్లింది.

దిగుమతి చేసుకోవడం నిషిద్ధం..
ఈ మేరకు 2022 ఏప్రిల్ లో పాశ్చత్య దేశాలనుంచి ముంబైకి దిగుమతి అయిన బాడీ మసాజర్ల స్టాక్ ను ముంబై కస్టమ్స్ కమిషనర్ జప్తు చేశారు. ‘బాడీ మసాజర్లు మేజర్స్ సెక్స్ టాయ్స్. 1964లో జారీ చేసిన కస్టమ్స్ రూల్స్ ప్రకారం వాటిని దిగుమతి చేసుకోవడం నిషిద్ధం’ అని కస్టమ్స్ కమిషనర్ పేర్కొన్నారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారవేత్తలు కస్టమ్స్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా వ్యాపారులకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

ఇది కూడా చదవండి: Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం!

ఆ వస్తువుల లిస్టులో చేర్చలేం..
ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు ముంబై హైకోర్టును సంప్రదించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నిషేధిత వస్తువుల లిస్టులో దీనిని చేర్చలేమని తెలిపింది. అలాగే మసాజర్ వంటి మెషీన్ లను బుక్స్, పేపర్, కరపత్రం, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి మెటీరియల్ తోనూ సరిపోల్చలేమని స్పష్టం చేసింది. దీనిని శృంగార పరికరంగా వాడుతారనేది కేవలం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పింది. దీనిని ఎవరైనా నిర్భయంగా వాడుకోవచ్చని స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు