Libya Floods: లిబియా జరిగిన దారుణం ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఒక్కరాత్రిలోనే 20 వేల మంది చనిపోయారు అంటే నమ్మశక్యం కావడం లేదు. కానీ నమ్మక తప్పని ఈ చేదు సంఘటనకు కారణం కేవలం ఒకే ఒక్క రాకాసి అల. దాదాపు ఏడు మీటర్ల ఎత్తుకు పొంగుకొచ్చిన ఈ భారీ అల లిబియాలోని డేర్నా నగరాన్నంతటినీ
ముంచేసిందని చెబుతున్నారు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ నిపుణులు. ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం చివర వరకు ఉంటుందని అంటున్నారు. సముద్రంలో అల తనతో పాటూ తీసుకొచ్చిన బురదతో డేర్నాలోని పెద్ద పెద్ద భవనాలను కూల్చేయడమే కాక ప్రజలను సముద్రంలోకి ఈడ్చుకువెళ్ళిపోయింది. పోనీ ఇదేదో ఉదయం పూట జరిగి ఉంటే కనీసం ప్రజలు వెంటనే అలర్ట్అయ్యేవారు తమ ప్రాణాలను కాపాడుకునే వారు. కానీ మంచి నిద్రలో ఉన్న సమయంలో జరగడంతో వారికి కనీసం ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. సెప్టెంబర్ 10వ తేదీ తెల్లవారుఝామున 3 గంటలకు జరిగిందీ సంఘటన.
లిబియాలోని ఈ సంఘటన జరిగిన ఐదు రోజులు గడుస్తోంది. కానీ ఇప్పటికీ అక్కడి సముద్రం తీరంలో శవాలు తేలియాడుతూనే ఉన్నాయి. డ్యామ్ గోడలను బద్దలు కొట్టుకు వచ్చిన రాకాసి అల పర్వతాలను దాటుకుని మరీ వచ్చి నగరం మీద పడింది. డేర్నాలో లక్షమంది ప్రజలు నివసిస్తున్నారు. అందులో ఇప్పుడు 20వేల మంది చనిపోయారు. ఈ ఊరుకి ఇలాంటి వరదలు 1942 నుంచి ఇప్పటి వరకు 5సార్లు వచ్చాయి. 2011లో లాస్ట్ ఈ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.
వరదలో 20 వేల మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నారు.కానీ ఇప్పటివరకూ 11 వేల మందివి మాత్రమే మృతదేహాలు లభ్యమయ్యాయి. దాదాపు 30వేల మంది ఇళ్ళు కోల్పోయారు.ఈ విధ్వంసం నుంచి కోలుకోవడానికి డేర్నా కు కొన్నేళ్ళు పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ నగరానికి, సముద్రానికి మధ్య రెండు డ్యామ్ లు ఉన్నాయి. ఇవి ఒక్కోటి 75 మీటర్లు, 45 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. వీటి నుంచి వరద ముప్పు ఉందని సెభా యూనివర్శిటీ ఎప్పటి నుంచో చెబుతోంది. దానికి సంబంధించి రీసెర్చ్ పేపర్ ను కూడా సబ్ మిట్ చేసింది.
Also Read:నాలుగేళ్ళ బాలిక మీద అత్యాచారం…బాడీని తినేసిన కుక్కలు