Massive Floods In Libya: లిబియాలో విధ్వంసం..5 వేల మందికిపైగా మృతి..రోడ్లపైనే డెడ్ బాడీలు..!
ఆకస్మిక వరదలు లిబియాలో బీభత్సం సృష్టించాయి. జల ప్రళయంలో ఇప్పటికే 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపైనే డెడ్‌బాడీలు పడి ఉన్నాయి. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్ అన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. దాదాపు 1.25 లక్షల కుటుంబాలు నివాసముండే డెర్నాలో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, బైక్‌లు వరదలకు కాగితపు పడవల్లా తేలుతూ కొట్టుకుపోయాయి.