హిందూయేతర ఉద్యోగులు వద్దు.. శ్రీవాణి ట్రస్టు రద్దు.. TTD ఛైర్మన్ సంచలన నిర్ణయాలు!

టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌కే నాయుడు నియమితులైన తర్వాత పాలకమండలి మొదటి సమావేశం ఈ రోజు జరిగింది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ వేరొక ట్రస్ట్‌లో విలీనం చేయనున్నారు. అలాగే శారదాపీఠానికి ఇచ్చిన స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.

TTD : టీటీడీ నుంచే ప్రక్షాళన : సీఎం చంద్రబాబు
New Update

ఇటీవల టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి మొదటి సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో దర్శనం చేసుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. అన్యమతస్థు ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తామని లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామన్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మారుస్తూ..

శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మారుస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో రాజకీయాలు ప్రసంగాలు నిషేధం, మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తిరుపతిలో ఉండే స్థానికులకు దర్శన భాగ్యం కల్పన ప్రతి నెల మొదటి మంగళవారం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి దీన్ని వేరొక ట్రస్ట్‌లో విలీనం చేస్తామన్నారు.

హిందూయేతర ఉద్యోగులు వద్దు..

తిరుమలలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా టీటీడీ నిర్ణయించిందని తెలిపారు. ఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని లేదా వీఆర్‌ఎస్ అందించాలని టీటీడీ కోరుతోంది. ఆలయ ఉద్యోగులందరూ టీటీడీ ధార్మిక, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగా ఉండేలా కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అలాగే నిత్య అన్నదానం విషయంలో ఇంకా మెరుగుపరచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఆహార పదార్థాల కంటే ఇంకా ఎక్కువ పదార్థాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. శారదాపీఠానికి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు

శాశ్వత ఉద్యోగులకు రూ. 17,400, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.7,530 బ్రహ్మోత్సవ బహుమానంగా ఇవ్వనున్నారు. తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదని తెలిపారు. టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేయనున్నారు. ఎందుకంటే భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవలోక్ ప్రాజెక్ట్‌కి ఇచ్చిన 20 ఎకరాల్లో.. ఇప్పుడు ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టనున్నారని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. 

ఇది కూడా చూడండి:  అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

#brk-naidu #ttd #ttd-chairman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe