Congress Press Meet:
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఒకటి ఫలితాల్లో వచ్చింది మరొకటి. ఇక్కడ ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని అన్ని సర్వేలు అంచనాలు వేశాయి. కానీ సీన్స్ రివర్స్ అయి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. దీనిపై కాంగ్రెస్ పెద్దలు స్పందించారు. సీనియర్ నేత జై రామ్ రమేశ్ మరికొంత మంది నేతలు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. హర్యానాలో ఎన్నికల తీర్పును తాము అంగీకరించమని చెప్పారు. కచ్చితంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని జైరాం రమేష్ ఆరోపించారు. హర్యానా ప్రజల కోరికను బీజేపీ మార్చేసిందని అన్నారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్త్ తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. కనీసం మూడు జిల్లాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని తమకు రిపోర్ట్ అందాయని...దాంతో పాటూ చాలా చోట్ల ఓట్ల లెక్కింపులో కూడా అవకతవకలు జరిఆయని జైరాం రమేశ్ ఆరోపించారు. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. హర్యానా ఎన్నికలు ఫలితాలు గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా ఉన్నాయని జైరాం రమేశ్ విమర్శించారు.
Also Read: Stock Market: హమ్మయ్య గట్టెక్కింది..లాభాల్లో స్టాక్ మార్కెట్