ఘోర రోడ్డు ప్రమాదం.... తొమ్మిది మంది మహిళలు మృతి...!

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వయనాడ్ జిల్లా మనంత వాడి సమీపంలో కూలీలతో వెళ్తున్న జీపు ఒకటి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మూల మలుపు వద్ద అదుపు తప్పడంతో జీపు లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.

author-image
By G Ramu
New Update

మృతులంతా మహిళేనని వెల్లడించారు. టీ ఎస్టేట్ లో మహిళా కూలీలంతా పని ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు వివరించారు. వంతవాడి సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారని పేర్కొన్నారు.

లత అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం కోజికోడ్ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటన గురించి సీఎం పినరయి విజయన్ దృష్టికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ తీసుకు వెళ్లారు. దీంతో మనంతవాడీ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించాలని తనను సీఎం ఆదేశించారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామన్నారు.

మరణించి వారి మృత దేహాలు అదే ఆస్పత్రిలో వున్నట్టు అధికారులు చెప్పారు. మృత దేహాలకు పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆ జీపు దీపు టీ ట్రేడింగ్ కంపెనీకి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కన్నమల ప్రాంతంలో కల్వర్టును ఢీ కొట్టడంతో జీపు అదుపుతప్పి లోయలోకి దూసుకు వెళ్లిందని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు