Mumbai:వీల్ ఛైర్‌ లేక చనిపోయిన వృద్ధుడు..మంబై ఎయిర్‌పోర్టులో ఘటన

వీల్‌ఛైర్‌ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన.

Mumbai:వీల్ ఛైర్‌ లేక చనిపోయిన వృద్ధుడు..మంబై ఎయిర్‌పోర్టులో ఘటన
New Update

Old man died At Mumbai Airport:పేరుకు పెద్ద ఎయిర్ పోర్ట్. భారతదేశంలో అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ అది. ఇక్కడి నుంచే చాలా విదేశీ విమానాలు వెళుతుంటాయి, వస్తుంటాయి. నిత్యం వేల మంది ఇక్కడ నుంచి ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి ముంబయ్ ఎయిర్ పోర్ట్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వీల్‌ఛైర్‌ కూడా లేని దుస్థితిలో ఉంది ముంబయ్ ఎయిర్ పోర్ట్‌. ఇది లేక ఓ వృద్ధుడు ప్రాణాలు పోగొట్టుకున్నంత వరకు ఈ విషయం వెలుగులోకి కూడా రాలేదు. అధికారులు గుర్తించలేదు.

Also Read:Telangana:కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్

ఏం జరిగిందంటే...

ఇద్దరు వృద్ధ దంపతులు న్యూయార్క్ నుంచి ముంబై వచ్చారు. అందులో పెద్దాయన వయసు 80 ఏళ్ళు. వీరు ముందుగా వీల్ ఛైర్ సర్వీసులును బుక్ చేసుకున్నారు. కానీ తీరా ముంబైకు చేరుకున్నాక వారికి ఒకటే వీల్ ఛైర్ లభించింది. దీంతో ఆ పెద్దాయన తన బార్యను అందులో కూర్చోపెట్టి...ఆయన మాత్రం నడిచారు. ముంబై చాలా పెద్ద ఎయిర్ పోర్ట్. విమానం ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఇమ్మిగ్రేషన్‌కు రావడానికి చాలా దూరమే నడవాలి. అలా ఆ పెద్దాయన 1.5 కిలోమీటర్లు నడిచారు. పాపం అంత దూరం నడిచారు. చివరకు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి గుండెపోటు వచ్చి పడిపోయారు. ఆయనను వెంటనే నానావతి ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ప్రాణం నిలవలేదు.

కనీస సౌకర్యాలు లేకపోవడం ఏంటో..

అంత పెద్ద ఎయిర్ పోర్ట్‌లో...రోజూ వేలమంది ప్రయాణించే చోట వీల్ ఛైర్‌ లాంటి సౌకర్యాలు లేకపోవడం ఏంటో అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలను ఎయిర్ పోర్ట్ అధికారులు ఎలా నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. విమాన సర్వీసులు అయినా పట్టించుకోవాలి కదా అని అడుగుతున్నారు. అయితే వృద్ధుడు ప్రయాణించిన ఎయిర్ ఇండియా ఈ సంఘటన మీద స్పందించింది. తాము ప్యాసింజర్లను వెయిట్ చేయమని చెప్పామని...అయినా వారు వినకుండా నడిచి వెళ్ళిపోయారని చెబుతోంది.

Also Read:Bharath Jodo Yatra:తేజస్వి యాదవ్ జీపులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

#airport #mumbai #died #old-man #wheel-chair
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe