దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఫ్యామిలీని కబళించిన మృత్యువు

ఒడిశాలోని కేంఝర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 20 మంది దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 7గురు చనిపోగా ఓ చిన్నారి చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఫ్యామిలీని కబళించిన మృత్యువు
New Update

దైవ దర్శనానికి వెళ్తున్న ఓ కుంటుంబాన్ని ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. పిల్ల పాపలతో కలిసి తమ మొక్కు చెల్లించుకునేందుకు గురువారం రాత్రి బయలుదేరగా గమ్యం చేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారు జామునే జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేయగా.. మిగతా కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చింది.

Also read :పాలిటెక్నిక్‌లో కొత్త సిలబస్‌.. అయిదేళ్లు కష్టపడితే డైరెక్ట్ జాబ్

ఈ మేరకు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని కేంఝర్‌ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గంజాం జిల్లా సన్నొఖెముండి సమితిలోని పుడామారి, బతాగడ, పాలొఝడి గ్రామాలకు చెందిన 20 మంది కుటుంబ సభ్యులు కేంఝర్‌ జిల్లాలోని ఘటగావ్‌ టౌన్‌లో తరిణి అమ్మవారు, పూరీలో జగన్నాథుడిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి వింగర్‌ వాహనంలో బయల్దేరారు. అయితే శుక్రవారం వేకువజామున 20వ నంబరు జాతీయ రహదారిపై బలిజోడి గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న వారి వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కు వెనక భాగాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది అక్కడిక్కడే ప్రాణాలో కొల్పోగా ఓ చిన్నారి చికిత్స పొందతూ మరణించింది. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఎం నవీన్‌ పట్నాయక్‌ మృతులకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం అందించారని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

#odisha #road-accident #8-people-died
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe