Telangana: తెలంగాణలో 8మంది నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ.

తెలంగాణలో ఎనిమిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
TSLPRB Constable Recruitment: హైకోర్టు ఆర్డర్.. తెలంగాణ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్..

తెలంగాణలో ఎనిమిది మంది నాన్‌ క్యాడర్‌ ఎస్పీలు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిలో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీగా ధార కవిత, మల్కాజిగిరి-భువనగిరి ఎస్‌ఓటీ డీసీపీగా రమణారెడ్డి, ఆక్టోపస్‌ ఎస్పీ అడ్మిన్‌గా ఎం వెంకటేశ్వర్లు, మాదాపూర్‌ ఎస్‌ఓటీగా డి. శ్రీనివాస్‌, సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీగా శ్రీబాల దేవి, తెలంగాణ పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సునీత మోహన్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా సాయిశేఖర్‌, ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీగా ఎస్‌. వినోద్‌ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు