తైవాన్ రాజధాని తైపీలో.. బుధవారం ఉదయం 8 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ భూకంపం దాటికి ఏడుగురు మృతి చెందారని.. అలాగే 730 మంది గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. గత 25 ఏళ్లలో తైవాన్ ఇంతటి తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ భూకంపం ప్రభావానికి పలు బిల్డింగ్‌లు కూలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
Also Read: వేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. అక్కడ చికెన్ బంద్!
తైవాన్ భూకంప ప్రభావానికి.. జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ దీవులకు దాదాపు 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే సునామీ వచ్చే అవకాశం ఉందని.. వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు అధికారులు తెలిపారు. సునామీ వస్తుందని అందరూ ఇళ్లు ఖాళీ చేయాలని జపానీస్ వార్త సంస్థలు ప్రసారాలు చేస్తున్నాయి.
అయితే తైవాన్‌లో భూకంపాలు తరుచుగా వస్తుంటాయి. 1996లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావానికి ఏకంగా 2400 మంది ప్రజలు మరణించారు. జపాన్‌లో ప్రతిఏటా సుమారు 1500 వరకు భూకంపాలు వస్తుంటాయి.
Also Read: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం : వరల్డ్ బ్యాంక్