మహారాష్ట్రలో భారీ ప్రమాదం జరిగింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్‌లో గరువారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. మంటలు భారీగా ఎగసిపడి మరో రెండు బిల్డింగ్‌లకు కూడా వ్యాపించాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Also Read: రేవ్ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..!
15 అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరీ భవనంలో 8 మంది చిక్కుకోగా.. వారిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, దాని పక్కనే ఉన్న ఇళ్లు కూడా పాక్షికంగా కాలిపోయాయి.
Also read: ఇలా చేస్తేనే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా? జూన్ 1 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు..