NEET Paper Leak: నీట్‌ పరీక్షను రద్దు చేయకండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు

నీట్‌ పేపర్‌ లీకేజీ తర్వాత పరీక్షను మరోసారి నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. జులై 8న దీనిపై విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలోనే నీట్‌లో మంచి ర్యాంక్ సాధించిన 56 మంది విద్యార్ధులు పరీక్ష రద్దు చేయొద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

NEET Paper Leak: నీట్‌ పరీక్షను రద్దు చేయకండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు
New Update

నీట్‌ పేపర్‌ లీకేజ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో దీనిపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో నీట్‌ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 50 మందికి పైగా గుజరాత్‌కు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్‌ పరీక్షను రద్దు చేయకూడదని కేంద్రానికి, ఎన్‌టీఏకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. అలాగే నీట్‌ పేపర్ లీకేజీకి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించేలా ఆదేశాలివ్వాలని కోరారు.

Also read: దారుణం.. అందరిముందే నిప్పంటించుకున్నాడు

అయితే నీట్‌ పేపర్‌ లీకేజీ బయటపడిన అనంతరం నీట్‌ పరీక్షను మరోసారి నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే జులై 8న సుప్రీం ధర్మాసం దీనిపై విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలోనే 56 మంది విద్యార్ధులు నీట్‌ పరీక్ష రద్దు చేయొద్దంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహిస్తే.. నిజాయితీగా కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read: భోలే బాబాను అరెస్టు చేయరా ?.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

#telugu-news #neet #neet-paper-leak
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe