Rains In Telangana : తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ(Telangana) లో ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఐదు రోజులు పాటూ వర్షాలు(Rains) కురుస్తాయని చల్లటి కబురు అందించింది వాతావరణ శాఖ(Department of Meteorology). ఈరోజు నుంచి శుక్రవారం వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని.. 'ఎల్లో అలర్ట్' కూడా జారీ చేసింది.
ఈ జిల్లాల్లో వర్షాలు..
మహారాష్ట్ర(Maharashtra) నుంచి కర్ణాటక(Karnataka) మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, వికారాబాద్, ములుగు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వడగళ్ళ వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
మామిడి తోట రైతులు ఆందోళన..
మండే ఎండల్లో చల్లటి వానలు అందరికీ ఆనందాన్ని ఇస్తున్నా...మామిడి రైతులకు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మామిడి చిన్న చిన్న కాయలతో ఉంది. మరికొన్ని రోజుల్లో పెద్దవి అయి అమ్మకానికి రెడీ అవుతాయి. ఇలాంటి టైమ్‌లో వడగళ్ళ వానలు, ఈదురు గాలులు వీస్తే కాయలు రాలిపోయే అవకాశం ఉంటంది. పక్వానికి రాకుండా మామిడి రాలిపోతే వాటిని ఎవరూ కొనరు. దీని వలన మామిడి రైతులకు బారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అకాల వర్సాల వార్త మామిడి రైతులను ఆందోళనలో పడేసింది.
Also Read : Hyderabad: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం..స్వల్ప గాయాలు