Telangana: పండుగ వేళ విషాదం.. స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి మహబూబాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసం చెరువుకి వెళ్లిన ఓ బాలుడు (10) మృతి చెందాడు. అలాగే కొమురం భీం జిల్లాలో మరో నలుగురు యువకులు హోలీ ఆడిన అనంతరం నదిలో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందారు. By B Aravind 25 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హోలీ పండుగ వేళ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం విషాదం చోటుచేసుకుంది. హోలీ ఆడిన తర్వాత స్నానం చేసేందుకు చెరువులోకి వెళ్లిన రిత్విక్‌రెడ్డి (10) గల్లంతై మృతి చెందాడు. మండల కేంద్రంలోని నాలుగవ తరగతి చదువుతున్న రిత్విక్ రెడ్డి.. హలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి హోలీ ఆడాడు. ఆ తర్వాత స్నానం కోసమని గణేశ్ చెరువుకు వెళ్లాడు. రంగులు కడుక్కుంటుండగా.. ఒక్కసారిగా కాలుజారి చెరువులో పడిపోయాడు. అతని స్నేహితులు గ్రామస్థులకు వెళ్లి చెప్పడంతో.. వాళ్లు వచ్చేసరికి రిత్విక్ మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Also Read: బండి సంజయ్ మాస్ డ్యాన్స్.. హోలీ సంబరాల వీడియో వైరల్! మరోవైపు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పండుగ వేళ విషాదం జరిగింది. హోలీ ఆడిన అనంతరం నదిలోకి స్నానానికి వెళ్లి గల్లంతైన నలుగురు యువకులు మృతి చెందారు. నీట మునిగిపోయిన ఆ యువకుల మృతదేహాలను జాలర్లు బయటకు తీశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన సంతోష్, ప్రవీణ్ సాయి, కమలాకర్ అనే నలుగురు పండుగ సందర్భంగా హోలీ ఆడుకున్నారు. హోలీ వేడుకలు జరుపుకున్న అనంతరం తాటిపల్లి వద్ద వార్ధా నదిలోకి స్నానికి వెళ్లారు. కానీ నదిలోనే ఆ నలుగురు గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు ఆ యువకులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. నలుగురు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కౌటాల ఆసుపత్రికి తరలించారు. పండుగ రోజున ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందండతో నదిమాబాద్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. బంధు, మిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో ఇలా నదిలో స్నానానికి అని వెళ్లి యువకులు గల్లంతవుతున్న ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో చాలామంది యువకులు ఈత కోసమని నదులు, కాలువలకు వెళ్తుంటారు. దీంతో ఈత రాని యువకులు ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందుతున్నారు. అందుకే ఈత రానివారు నదులు, లేదా కాలువలకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. Also Read: మహిళలకు ఫ్రీబస్ తో మెట్రోకు షాక్.. ఎన్ని లక్షల మంది ప్రయాణికులు తగ్గారంటే? #telugu-news #telangana-news #holi-fest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి