Sanjeev Sanyal : సివిల్స్‌ పరీక్షల కోసం ఏళ్ల తరబడి కష్టబడటం వృథా : సంజయ్ సన్యాల్

సివిల్‌ సర్వీస్ పరీక్షల కోసం లక్షలాది మంది స్టూడేంట్స్ 5 నుంచి 8 ఏళ్ల పాటు కష్టపడటం యువశక్తిని వృథా చేయడమేనని ప్రధాన ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్‌ సన్యాల్ పేర్కొన్నారు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలను పలువురు మజీ బ్యూరోక్రాట్లు కొట్టిపారేశారు.

Sanjeev Sanyal : సివిల్స్‌ పరీక్షల కోసం ఏళ్ల తరబడి కష్టబడటం వృథా : సంజయ్ సన్యాల్
New Update

Civils Exams : ఐఏస్, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌తో పాటు ఇతర సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు(Civil Services Jobs) మనదేశంలో దేశంలో అత్యంత గౌరవం ఇస్తారు. ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు ఏటా లక్షలాది మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఇందుకోసం ఏళ్లతరబడి కష్టపడుతుంటారు. కానీ ఈ ఉద్యోగాలు కొందరికి మాత్రమే దక్కుతాయి. అయితే తాజాగా ప్రధాన ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్‌ సన్యాల్(Sanjeev Sanyal) సివిల్ సర్వీస్‌ పరీక్షల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సివిల్‌ సర్వీస్ పరీక్షల కోసం లక్షలాది మంది స్టూడేంట్స్ 5 నుంచి 8 ఏళ్ల పాటు కష్టపడటం యువశక్తిని వృథా చేయడమేనని పేర్కొన్నారు.

Also Read : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్‌ కూడా ఆ లిస్ట్‌ లో !

రెండుసార్లు ప్రయత్నిస్తే చాలు

' మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే లక్షలాది మంది యువతీ, యువకులు ఏళ్ల సివిల్స్‌ కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతారు. అదే తమ జీవన విధానంగా మార్చుకుంటారు. దీనివల్ల వారి యువశక్తి ఎంతో వృథా అవుతోంది. ఎట్టిపరిస్థితుల్లో కూడా సివిల్స్‌ సర్వీసుల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు రెండుసార్లు పరీక్షలు రాసి ప్రయత్నిస్తే చాలు. మీ 20 ఏళ్ల ప్రాయాన్ని అంతా దీనికే వృథా చేసుకోవద్దని' సంజీవ్‌ సన్యాల్ పేర్కొన్నారు.

అంత సులభం కాదు

ఇదిలా ఉండగా సంజీవ్‌ సన్యాల్ చేసిన వ్యాఖ్యలను మాజీ సివిల్ సర్వీసు ఉద్యోగులు ఖండించారు. గుజరాత్(Gujarat) కేడర్‌కు చెందిన 1962 బ్యాచ్ మాజీ ఐఏఎస్ అధికారి సుందరం మాట్లాడుతూ.. సంజీవ్ సన్యాల్ చేసిన సూచనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. లక్షలాది మంది పోటీ పడే ఈ పరీక్షల్లో.. ఒక్క ప్రయత్నంతోనే అందులో విజయం సాధించడం అంత సులభం కాదని తెలిపారు. ఇక మరో మాజీ ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ.. ఈ పరీక్షకు ప్రిపేర్ కావడం వల్ల యుశక్తి కానీ.. వనరులు కానీ వృథా కావని వాళ్లలో తెలివితేటలు విస్తృతమవుతాయని పేర్కొన్నారు.

Also Read : వాతావరణంలో మర్పులు.. దేశంలో మార్చిలోనే వడగాలులు..

#sanjeev-sanyal #upsc-civil-services-exams #civil-services #national-news #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe