లోక్‌సభ 4వ విడత ఎన్నికలు నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పలు చోట్ల రాత్రివరకు కుడా పోలింగ్ జరిగింది. అయితే సోమవారం రాత్రి 11.45 PM గంటల వరకు మొత్తం 67.25 శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో 76.50 శాతం నమోదుకాగా.. తెలంగాణ 64.74 శాతం పోలింగ్ నమోదైంది.
Also Read: ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు: ఏపీ సీఈవో ఎంకే మీనా!
బీహార్‌లో 57.06 శాతం, ఝార్ఖండ్ 65.2 %, మధ్యప్రదేశ్ 70.98 %, మహారాష్ట్ర 59.44 %, ఒడిశా 73.97 %, జమ్మూకశ్మీర్‌లో 37.98 %,ఉత్తరప్రదేశ్ 58.05 %, పశ్చిమ బెంగాల్ 78.37 శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు నియోజకవర్గాల్లో అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాడంతో ఓటింగ్ శాతం ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.