Kerala: వాయనాడ్‌లో 49 మంది చిన్నారులు గల్లంతు

కేరళలోని వాయనాడ్లో జరిగిన విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి 300 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆచూకీ దొరకని వారిలో 49 మంది చిన్నారులున్నారని ప్రభుత్వం తెలిపింది.

New Update
Kerala: వాయనాడ్‌లో 49 మంది చిన్నారులు గల్లంతు

Children Missing: వాయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని బీభత్సం ఇప్పుడు జరిగింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు భయంకరమైన వర్షాలు పడ్డాయి..వరదలు వచ్చాయి, కొండచరియలు విరిగిపడ్డాయి కానీ ఇంతటి భీభత్సం జరగడం మాత్రం ఇప్పుడే. వయనాడ్‌లో కొండయరియలు విరిగి పడి వందల మంది మరణించారు, వేలమంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య ఇప్పటికి 300 దాటింది. అర్ధరాత్రి పడుకున్న సమయంలో జరగడంతో తప్పించుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఇంకా అక్కడ సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో 49మంది చిన్నారుల ఆచూకీ లభించలేదని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పిల్లలు చనిపోయి ఉంటారు లేదా గల్లంతయ్యారు అని విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి అన్నారు. వరదల్లో ఓ హైస్కూల్‌ మొత్తం కొట్టుకుపోయిందని చెప్పారు. వెల్లరిమలలోని ఉన్నత పాఠశాల మొత్తం ధ్వంసమైంది. ముండక్కైతోపాటు పలు చోట్ల స్కూళ్ళు బాగా దెబ్బతిన్నాయి. ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు సర్టిఫికెట్లు, పుస్తకాలు కోల్పోయారని చెప్పారు. 94 రిలీఫ్‌ క్యాంపుల్లో దాదాపు 10వేల మందికి పునరావాసం కల్పిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Telangana: శ్రీశైలం –హైదరాబాద్ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్

Advertisment
తాజా కథనాలు