HIV: స్టూడెంట్స్‌ కు హెచ్‌ఐవీ..47 మంది మృతి!

త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్‌ఐవీతో మృతి చెందారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

New Update
HIV: స్టూడెంట్స్‌ కు హెచ్‌ఐవీ..47 మంది మృతి!

Tripura: త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్‌ఐవీతో (HIV) మృతి చెందారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 828 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్న విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత చదువుల కోసం చాలా మంది విద్యార్థులు త్రిపుర నుంచి వెళ్లిపోయారు. త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్‌ సొసైటీ 220 పాఠశాలలు, 24 కళాశాలలు విశ్వవిద్యాలయాల నుంచి డ్రగ్స్‌ ఇంజక్షన్స్‌ తీసుకుంటున్న విద్యార్థులను గుర్తించింది. ఇదొక్కటే కాదు... ప్రతిరోజు దాదాపు 5 నుంచి ఏడు కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదు అవుతున్నట్లు అక్కడ మెడికల్‌ రిపోర్ట్‌లు చెబుతున్నాయి.

ఈ విషయం గురించి టీఎస్‌ఏసీఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ త్రిపురలో హెచ్‌ఐవీ వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు డ్రగ్స్‌ కు బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. హెచ్‌ఐవీ కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని వారు వెల్లడించారు.

Also Read: తునిలో క్షుద్ర పూజలు కలకలం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు