Laos: లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి

లావోస్‌లో సైబర్‌ స్కామ్‌ సెంటర్లలో వెట్టిచాకిరీ చేస్తున్న 47 మంది భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ విడిపించింది. ఇలాంటి సైబర్‌ స్కామ్ సెంటర్లు భారతీయులకు తప్పుడు జాబ్‌ ఆఫర్‌ లెటర్లు ఇచ్చి లావోస్‌కు రప్పించి బలవంతంగా పనులు చేయించుకుంటున్నాయి.

Laos: లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి
New Update

లావోస్‌లో సైబర్‌ స్కామ్‌ సెంటర్లలో వెట్టిచాకిరీ చేస్తున్న 47 మంది భారతీయులు అక్కడి నుంచి విముక్తి పొందారు. తాజాగా భారత దౌత్య బృందం వారిని విడిపించింది. వీళ్లందరూ ఇష్టం లేకుండానే అక్కడ సైబర్‌ స్కామ్‌లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే లావోస్, కంబోడియాలో ఉద్యోగాల ఆఫర్లను అంగీకరించవద్దని మన విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది. ఈ దేశాల్లో బలవంతంగా సైబర్‌ నేరాల్లో భాగస్వాములైన వారిలో ఇప్పటికే 635 మంది భారతీయులను రక్షించింది. వీళ్లందరూ కూడా తప్పుడు ఉద్యోగ పత్రాలను నమ్మి ఈ సైబర్‌ స్కామ్ ఊబీలో చిక్కుకున్నారు.

Also Read: కరోనా వల్ల బ్రెయిన్‌ సమస్యలు.. సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు

బోకెవో ప్రావిన్స్‌లోని ది గోల్డెన్‌ ట్రయాంగిల్ స్పెషల్‌ జోన్‌ సెజ్‌లో 47 మంది భారతీయులు సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకున్నట్లు లావోస్‌లో ఉన్న భారత ఎంబసీ తెలిపింది. వీళ్లలో 29 మందిని లావోస్ అధికారుల దాడుల సందర్భంగా గుర్తించి భారత ఎంబసీకి అప్పగించారు. మరో 18 మంది తాము తీవ్ర వేధింపులకు గురవుతున్నట్లు రాయబార కార్యాలయంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వీళ్లందరినీ అక్కడి నుంచి విడిపించారు. త్వరలోనే వీళ్లు భారత్‌కు రానున్నారు. గత నెలలో మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారతీయులను అక్రమంగా రవాణ చేస్తున్నారనే అంశంపై లావోస్ ప్రధానితో చర్చలు జరిపారు.

ఇలాంటి సైబర్‌ స్కామ్‌ సెంటర్లు భారతీయులకు తప్పుడు జాబ్‌ ఆఫర్‌ లెటర్లు ఇచ్చి లావోస్‌కు రప్పిస్తున్నాయి. ఆ తర్వాత వారి పాస్‌పోర్టులు లాక్కొని బందీలుగా ఉంచుతున్నాయి. బలవంతంగా వాళ్లతో పనులు చేయించుకుంటున్నారు. దీంతో అక్కడ జీవితం అస్థవ్యస్థంగా మారింది. వీళ్లతో మహిళల పేర్లతో డేటింగ్ యాప్‌లలో తప్పుడు ఖాతాలు తెరిపించి.. స్కామ్‌లు చేయిస్తున్నారు.

Also Read: అలెర్ట్‌.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు

#indian-embassy #cyber-scam #telugu-news #laos
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి