Rajasthan: రాజస్థాన్‌లో ఫేక్ సర్టిఫికేట్ల కలకలం..43వేల తప్పుడు సర్టిఫికేట్లు

రాజస్థాన్‌లోని ఓం ప్రకాశ్ జోగేందర్ సింగ్ ప్రైవేటు యూనివర్శిటీలో ఫేక్ సర్టిఫికేట్ల అంశం కలకలం రేపుతోంది. ఏకంగా 43,409 డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్లను జారీ చేసింది ఆ యూనివర్శిటీ. రాజస్తాన్‌లోని చూరూలో ఉంది ఇది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

New Update
Rajasthan: రాజస్థాన్‌లో ఫేక్ సర్టిఫికేట్ల కలకలం..43వేల తప్పుడు సర్టిఫికేట్లు

Fake cerificates: దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విద్యావ్యవస్థ ఎటువైపు పయనిస్తుందోనని అనుమానంగా ఉంది. నిన్న, మొన్నటి వరకు నీట్ ప్రశ్నా పత్రాల లీకేజీ, నెట్ ఎగ్జామ్‌లో అవకతవకలతో హోరెత్తిపోయింది. ఇప్పుడు తాజాగా ఫేక్ సర్టిఫికెట్ల అంశం ఆందోళన రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 వేల దొంగ సర్టిఫికెట్లను జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని చూరూలో ఓం ప్రకాశ్‌ జోగేందర్‌ సింగ్‌ (OPJS) ప్రైవేటు యూనివర్సిటీ నిర్వాకం బయటపడింది. తప్పుడు డిగ్రీలతో పాటు మునుపటి తేదీలతో డిగ్రీలు ఇచ్చిందని ఈ యనివర్శిటీ మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని వేల ఫేక్ సర్టిఫికేట్లను జారీ చేశారన్న విషయాలపై కూపీలు లాగుతున్నారు.

ఎలా బయటపడింది...

రాజస్థాన్‌లో రీసెంట్‌గా ఫజికల్ ట్రైనింగ్ ఇనస్ట్రక్టర్ పరీక్ష అనౌన్స్ చేశారు. దీనికి వచ్చిన దరఖాస్తుల్లో 1300 మందివి ఒకే యూనివర్శిటీ జారీ చేసిన సర్టిఫికేట్లు. కేవలం 100 సీట్లు మాత్రమే ఉన్న ఈజాబ్‌కు చాలా మందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి 2020కు ముందు పట్టా పొందిన వారు మాత్రమే అర్హులని నియమం పెట్టింది. దీంతో అసలు వ్యవహారం బయటడింది. ఎందుకంటే అసలు డిగ్రీలు పొందినవారు కంటే రెట్టింపు సంఖ్యలో యూివర్శిటీకి చెందిన డిగ్రీలు వచ్చాయి. దీంతో వాటి మీద అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు..ఈ వ్యవహారం మీద దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఫేక్ సర్టిఫికేట్ల జారీ వెనుకఓం ప్రకాశ్‌ జోగేందర్‌ సింగ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు జోగిందర్ సింగ్ దలాల్ పాత్ర ఉందని పోలీసులు కనుగొన్నారు. దాంతో అతడిని వెంటనే అరెస్ట్ చేశారు. వీసా దరఖాస్తుల కోసం మునుపటి తేదీలతో డిగ్రీ సర్టిఫికేట్లు జారీ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆ యూనివర్సిటీ 2013 నుంచి ఇప్పటివరకు 708 పీహెచ్‌డీలు, 8861 ఇంజినీరింగ్‌ డిగ్రీలు, 1640 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చారు. వీటితోపాటు ముందస్తు తేదీలతో అనేక తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. దాంతో పాటూ కేవలం 30 మంది సిబ్బందితో మొత్తం యూనివర్సిటీని నడిపిస్తుండటంపైనా దర్యాప్తు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:National: మళ్ళీ రైతుల పాదయాత్ర..హర్యానా నుంచి ఢిల్లీకి..

Advertisment
Advertisment
తాజా కథనాలు