USA:అమెరికాలో మరో భారతీయుడు మృతి...వీధి గొడవలో చనిపోయిన వ్యాపారవేత్త

అమెరికాలో భారతీయులు మరణాలు ఎక్కువైపోతున్నాయి. గత పది రోజుల్లో ఇప్పటికి దాదాపు ఏడుగురు చనిపోయారు. తాజాగా వాషింగ్టన్‌లో జరిగిన ఓ వీధి గొడవలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త మరణించారు.

New Update
USA:అమెరికాలో మరో భారతీయుడు మృతి...వీధి గొడవలో చనిపోయిన వ్యాపారవేత్త

Indian Orgin business Man Killed: అమెరికాలో భారతీయుల మరణాలు ఆందోళనకు దారితీస్తున్నాయి. అది కూడా వరుసగా జరుగుతుండడంతో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా వారం రోజుల క్రితం భారత సంతతికి చెందిన వివేక్ తనేజా అనే వ్యాపారవేత్త వీధి గొడవలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో మృతి చెందారు. వాషింగ్టన్ పోలీసులు చెప్పిన కథనం ప్రకారం వివేక్ ఫిబ్రవరి 2 న అర్ధరాత్రి 2 గంటలకు ఒక రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళుతుండగా...గుర్తు తెలియని వ్యక్తితో గొడవ జరిగింది. అది కాస్తా ముదిరి దుండగుడు వివేక్ మీద దాడి చేశాడు. ఆయన తల మీద విచక్షణా రహితంగా కొట్టాడు. తల మీద దెబ్బ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వివేక్ ప్రాణాలు కోల్పోయారు.

Also Read:Cricket:మిగిలిన టెస్ట్‌ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ

దొరికితే 25 వేల డాలర్లు..

వివేక్ మీద దాడి చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు దాడి చేశాడు అన్న విషయాలు తెలియడం లేదు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫుటేజ్‌ ఆధారంగా దుండగుడి ఫోటోను విడుదల చేశారు. అతనిని పట్టిచ్చిన వారికి 25 వేల డాలర్ల రివార్డును ప్రకటించారు. పోలీసులు కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వివేకా తనేజా ఓ వ్యాపారవేత్త...

వివేక్ తనేజా భారత సంతతికి చెందిన వ్యక్తి. ఇతని వయసు 41 ఏళ్ళు. అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్న టెక్నాలజీ సొల్యూషన్స్‌, అనలైటిక్‌ ప్రొడక్ట్‌ ప్రొవైడర్‌ ‘డైనమో టెక్నాలజీస్‌’ సహ వ్యవస్థాపకుడు. వివేక్ వర్జీనియాలో నివాసం ఉంటున్నారు.

వరుసదాడులు...

భారతీయుల మీద అమెరికన్ల దాడులు ఈమధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయాయి. గత పది రోజుల్లో దాదాపుగా ఏడుగురు భారతీయులు అమెరికాలో మృతి చెందారు. ఇందులో అధికశాతం స్టూడెంట్సే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉన్నత విద్య చదువుకోవడానికి వెళ్ళిన హైదరాబాద్ విద్యార్ధి సయ్యద్ మజాహిర్ అలీ మీద అమెరికన్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. రోడ్డు మీద పరుగెడుతూ మరీ అతని మీద దాడి చేశారు. దీని మీద అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పందించారు. ఎవరి పట్ల అన్యాయం జరిగినా అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందని..చదువుకునేందుకు ఇక్కడకు వచ్చిన విద్యార్ధుల రక్షణ భరోసాకు అమెరికా ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు