Israel Hamas War : ఎటు చూసినా శవాలే.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో 40 వేల మంది మృతి!

గాజాలో ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ వివాదంలో 92,401 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

New Update
Israel Hamas War : ఎటు చూసినా శవాలే.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో 40 వేల మంది మృతి!

GAZA : గాజాలో ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం (Israel - Hamas War) లో ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ వివాదంలో 92,401 మంది తీవ్రంగా గాయపడ్డారు. 85 శాతం మంది తమ ఇళ్లను విడిచి వెళ్లిపోయారు.

అక్టోబర్‌ 7 న హమాస్‌ ఇజ్రాయెల్ పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో సుమారు 1200 మంది చనిపోయారు. తమ వద్ద ఇంకా 111 మంది బందీలుగా ఉన్నారని అందులో మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారని ఇజ్రాయెల్‌ తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు ఇటీవలి చరిత్రలో అత్యంత వినాశకరమైన సైనిక కార్యకలాపాలలో ఒకటి.

యుద్ధం గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని (Human Crisis) నెలకొల్పింది. ఆకలి పరిస్థితి మరింత దిగజారుతోంది. ఒక నివేదిక ప్రకారం, రాబోయే కొద్ది నెలల్లో 4,95,000 మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆకలి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Also Read: విరాళంగా రూ. 4 వేలు..జైలు శిక్ష 12 ఏళ్లు!

Advertisment
తాజా కథనాలు