Tamilnadu : తమిళనాడులో కల్తీసారా కలకలం.. 40కి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడులో కల్తీసారా తాగి మృత్యవాత పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. మొత్తం 109 మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

New Update
Tamilnadu : తమిళనాడులో కల్తీసారా కలకలం.. 40కి చేరిన మృతుల సంఖ్య

Illicit Liquor : తమిళనాడు (Tamilnadu) లో కల్తీసారా తాగి మృత్యవాత పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కళ్లకురిచి జిల్లా కరుణాపురం కల్తీసారా వ్యవహారం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 109 మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కల్తీసారా ప్రభావం వల్ల కొందరికి కిడ్నీలు, ఇతర ఆర్గాన్‌లు ఫెయిల్‌ అవుతున్నాయి.

Also Read: భారత్ లో ఏఐ అసిస్టెంట్‌ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందంటే!

విళుపరం, తిరుచ్చి, సేలం, తిరువణ్ణామలై తదితర జిల్లా పరిధిలో వైద్య కళాశాలల (Medical College) వైద్యుల్ని తీసుకొచ్చి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా.. కుటుంబ పెద్దలు కల్తీసారా తాగి మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పలు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ పలువురు నిరసనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు అదుపుతప్పకుండా ఉండేందుకు రాష్ట్ర సర్కార్‌ పోలీసులను రంగంలోకి దింపింది.

Also Read: యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా..? 

Advertisment
Advertisment
తాజా కథనాలు