/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-12-1-jpg.webp)
Jhelum River : జమ్మూ కశ్మీర్(Jammu & Kashmir) లో విషాదం జరిగింది. శ్రీనగర్(Srinagar) సమీపంలోని జీలం నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల విద్యార్థులతో సహా మరికొందరు గల్లంతయ్యారు. సమాచారం మేరకు రాష్ట్ర విపత్తు సహాయ దళం ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అక్కడి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పడవలో విద్యా్ర్థులతో సహా మరికొందరు ప్రయాణిస్తున్నారు.
Also Read: సల్మాన్ ఇంటివద్ద కాల్పులు చేసిన నిందితులు అరెస్టు..
వీళ్లందరు గాంద్‌బల్ నుంచి బట్వారా ప్రాంతానికి పడవలో వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురిని కాపాడారు. మరికొందరు గల్లంతయ్యారు. ఎంతమంది గల్లంతయ్యారన్న సంఖ్య తెలియాల్సి ఉంది. అయితే గత రెండురోజులుగా శ్రీనగర్‌లో వర్షాలు(Rains) కురుస్తున్నాయి. దీంతో నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. భారీ వర్షాలతో కొండచరియలు కూడా విరిగిపోయాయి. దీంతో పోలీసులు జమ్మూ-శ్రీనగర్ రహదారిని మూసివేశారు.
#WATCH | J&K: A boat capsized in River Jhelum at Gandbal. SDRF team deployed. More details awaited: Disaster Management, J&K pic.twitter.com/hOAKvNCYtT
— ANI (@ANI) April 16, 2024