Crime News : దారుణం.. మొబైల్‌ఫోన్‌ పేలి నలుగురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా.. మొబైల్‌ ఫోన్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించిన వారి తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!
New Update

Mobile Phone Explosion : ఈ మధ్యకాలంలో ఇళ్లల్లో షార్ట్‌సర్క్యూట్‌(Short Circuit) ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని మీరట్‌లో జరిగింది. ఓ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా.. మొబైల్ ఫోన్‌ పేలిపోయింది(Mobile Phone Explosion). ఒక్కసారిగా మంటలు చెలరేగిపోవడంతో.. నలుగురు చిన్నారులు మృతి చెందారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Also Read: బంగారం,వెండి కంటే అత్యంత ఖరీదైన రంగు!

మొబైల్‌ఫోన్‌కు ఛార్జింగ్ 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోదిపురం జనతా కాలనీలో జానీ(41) బబిత(37) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు(5) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే శనివారం సాయంత్రం పిల్లలు ఇంట్లో ఓ గదిలో ఆడుకుంటూ  మొబైల్‌ ఛార్జర్‌ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఇలా పెట్టిన కొద్దిసేపటికీ ఒక్కసారిగా షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించింది. దీంతో మొబైల్‌ ఫోన్‌ పేలి పక్కనే ఉన్న మంచానికి మంటలు అంటుకున్నాయి.

మంటలు చుట్టుముట్టడంతో పిల్లలు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను కాపాడారు. వాళ్లని కాపాడిన క్రమంలో జానీ, బబితలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు రావడంతో.. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ కటుంబ సభ్యుల్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థతి కూడా విషమంగా ఉంది. బబిత పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను ఢిల్లీ(Delhi) లోని ఎయిమ్స్‌ ఆసుపత్రి(Aims Hospital) కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఈ ఊర్లో అందరూ కుంభకర్ణులే..పడుకుంటే నెల రోజులు లేవరు!

#telugu-news #crime-news #national-news #mobile-phone-explosion
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe