UttarPradesh: సంతానం లేని జంటకు మైనార్ బాలికల అండాలు అమ్ముతున్న ముఠా.. నలుగురు అరెస్టు

పేదింటి మైనర్ బాలికలకు డబ్బులు ఆశచూపి వారి అండాలను అమ్ముకుంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్‌ కేంద్రాలకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు అమ్ముతున్నారని.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

UttarPradesh: సంతానం లేని జంటకు మైనార్ బాలికల అండాలు అమ్ముతున్న ముఠా.. నలుగురు అరెస్టు
New Update

వివాహం అయ్యాక దంపతులు తమకు పిల్లలు కావాలని కోరుకుంటారు. అయితే కొన్ని జంటలకు త్వరగానే సంతానం కలుగుతుంది. మరికొందరికి చాలా ఏళ్లు పడుతుంది. అసలు సంతానమే కలగని దంపతులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులనే కొంతమంది దుండగులు టార్గెట్ చేశారు. పేద బాలికలకు డబ్బులు ఆశ చూపించి.. వారి నుంచి అండాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వాటిని అమ్ముకుంటున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. అయితే ఈ వ్యవహారంపై ఓ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. సంతానం కోసం ఐవీఎఫ్‌ కేంద్రాలకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు అమ్ముతున్నారని.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also read: డీప్‌ఫేక్‌ వీడియోలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

పేదింటి మహిళలకు డబ్బులు ఆశచూపెట్టి వారి వయస్సుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని.. అలాగే బాలిక అండాలు సేకరించడం కోసం రూ.30వేలు ఇస్తామని చెప్పి, రూ.11500 మాత్రమే ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు దీనిపై విచారణ జరిపారు. నవపుర అనే ప్రాంతానికి చెందిన సీమాదేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్ అలాగే ఖోంజ్వాన్ ప్రాంతానికి చెందిన అనితా దేవి, సోన్‌భద్రకు చెందిన అన్మోల్‌ జైస్వాల్‌ను అరెస్టు చేశారు. ఐవీఎఫ్ సెంటర్‌ సిబ్బంది, వైద్యులకు మధ్య ఇందులో సంబంధం ఉందని ఆరోపణలు చేశారు. అయితే నిబంధనల ప్రకారం చూసుకుంటే.. అండ దానం చేసే మహిళ వయస్సు 23 ఏళ్లకు మించి ఉండాలి. అంతేకాదు ఆమెకు వివాహమై.. మూడేళ్లకు పైగా వయసున్న బిడ్డ ఉండాలి. అలాగే ఒక మహిళ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇలా అండం దానం చేసేందుకు అర్హత ఉంటుందని పోలీసులు తెలిపారు.

Also Read: కంపు ఉండదు.. పొలూష్యన్ ఉండదు.. కారులో గాల్లోనే ఎగిరిపోవచ్చు..!

#telugu-news #crime-news #national-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe