Watch Video: కొంపముంచిన మెడికల్ స్టూడెంట్స్ రీల్స్.. చివరికి.. కర్ణాటకలోని గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న కొందరు విద్యార్థులు.. ఆసుపత్రిలో రీల్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇలా రీల్స్ చేయడంపై కళాశాల యాజమాన్యం వారికి ఫైన్ విధించింది. By B Aravind 11 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి 38 Medical Students Suspended: ఇప్పుడు ప్రతిఒక్కరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. రోజులో కొన్ని గంటల పాటు వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనే జనాలు గడుపుతున్నారు. కొంతమంది తమ ప్రతిభను చూపించుకుని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు పాపులారిటీ కోసం వింత పనులు చేస్తూ హల్‌చల్ చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో రీల్స్ అనేవి ట్రెండంగ్‌లో ఉన్నాయి. ఈ రీల్స్ చేసి కూడా కొందరు తమ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. అయితే తాజాగా కర్ణాటలో (Karnataka) ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు వైద్యవిద్యార్థులు ఏకంగా ఆసుపత్రిలోనే రీల్స్ (Reels) చేశారు. Also Read: ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చిన రైతులు.. బార్డర్లు మూసేసిన ప్రభుత్వం పర్మిషన్ తీసుకోలేదు ఇక వివరాల్లోకి వెళ్తే.. గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న38 మంది విద్యార్థుల శిక్షణ మరో 20 రోజుల్లో పూర్తి కానుంది. త్వరలోనే ఆ కాలేజీలో ఫ్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరగనుంది. దీనికోసం ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఆ విద్యార్థులు ఆసుపత్రిలో రీల్స్ చేశారు. అయితే ఈ వీడియో వైరల్ అయింది. దీంతో విద్యార్థుల చర్యపై కళాశాల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు ఫైన్ ఆసుపత్రిలో రీల్స్ చేసేందుకు విద్యార్థులకు యాజమాన్యం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కళాశాల డైరెక్టర్ డా.బసవరాజ్ అన్నారు. ఇలాంటి వాటిని తాము ప్రోత్సహించమని.. వాళ్లు ఏం చేయాలనుకున్న ఆసుపత్రి బయట చేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు.. వారికి జరిమానాతో పాటు ట్రైనింగ్‌ను (Training) మరో 10 రోజులు పొడగించామని తెలిపారు. ఇదిలాఉండగా.. ఇటీవల చిత్రదుర్గ అనే జిల్లాలో ఉన్న ఆసుపత్రిలో.. ఓ వైద్యుడు ఆపరేషన్ గదిలో తన ప్రీవెడ్డింగ్ షూట్ చేసిన సంగతి తెలిసందే. దీనిపై స్పందించిన కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావ్ (Dinesh Gundu Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడ్ని వెంటనే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 38Medico SUSPENDED for making Reels in part time ! Meanwhile Beaurocrats who are roaming only with camera daily basis getting PROMOTIONS !! Sould Doctors be not Rights to Enjoy?#MedTwitter pic.twitter.com/VjmYk2dhRm — Indian Doctor🇮🇳 (@Indian__doctor) February 11, 2024 Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఎఫ్ఐఆర్ నమోదు #hospital #reels #karnataka-news #medical-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి